Kalki: ‘కల్కి’ ఫస్ట్ సాంగ్ అప్డేట్.. ఏ క్షణమైనా రావొచ్చు?
మరో రెండు వారాల్లో కల్కి 2898 ఏడి సినిమా భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఏ క్షణమైనా ఈ సాంగ్ అప్డేట్ రావొచ్చని అంటున్నారు.
'Kalki' first song update.. can it come any moment?
Kalki: సమ్మర్లో రావాల్సిన కల్కి సినిమాను ఎన్నికల నేపథ్యంలో జూన్ 27కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నాగ్ అశ్విన్ ఊహకందని ప్రపంచాన్ని సృష్టించినట్టుగా ట్రైలర్లో చూపించారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదరగొట్టేశాడు నాగి. కానీ కల్కి కథను అర్థం కాకుండా ట్రైలర్ కట్ చేశాడు. అసలు ఈ ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ అనే టాక్ ఉంది. దీంతో.. మరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టుగా ఓ క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికైతే.. కొద్ది రోజుల క్రితమే కల్కి ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ట్రైలర్ కంటే ముందే.. ఫస్ట్ సాంగ్‌తో ప్రొమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని అన్నారు. కానీ ఫస్ట్ సింగిల్‌ని హోల్డ్‌లో పెట్టి ట్రైలర్ రిలీజ్ చేశారు.
అయితే.. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కోసం మీరు ఎంత హైప్‌గా ఉన్నారు? అంటూ, కల్కి ఆడియో రైట్స్ దక్కించుకున్న సరిగమ సౌత్ సంస్థ ఓ పోస్ట్ చేసింది. దీంతో.. వెయిటింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్ అప్డేట్ ఏ క్షణమైనా రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కల్కిలో టా టక్కరా అనే బిట్ బయటికి వచ్చింది. ఆ పాటను ప్రభాస్, దిశా పటానీలపై చిత్రీకరించారు. దీంతో.. అదే సాంగ్‌ను ఇప్పుడు రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. దీంతో ఫస్ట్ సాంగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి కల్కి ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.