»What Happened To Samantha Again What Are The Problems This Time
Samantha: మళ్లీ సమంతకు ఏమైంది? ఈసారి సమస్యలేంటి?
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అయితే.. అంతా సెట్ అయి సినిమాలు చేస్తుందనుకున్న సమంతకు.. మళ్లీ ఏమైందనే చర్చ మొదలైంది.
What happened to Samantha again? What are the problems this time?
Samantha: స్టార్ బ్యూటీ సమంత గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సామ్. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్లో చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇది తప్పితే మరో కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయలేదు అమ్మడు. అయితే.. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో, పాడ్ కాస్ట్‌లతో అభిమానులతో టచ్‌లో ఉంటూనే ఉంది సామ్. అలాగే నిర్మాతగా కూడా రాణించాలని అనుకుంటోంది. గతంలోనే తాను నిర్మాతగా మారుతున్నట్టు ప్రకటించింది. ‘త్రాలల మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించించింది. తన సొంత సంస్థలో తనే హీరోయిన్గా ఓ సినిమా కూడా ప్రకటించింది. ఈ సినిమాకు ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లో సమంత లుక్ అదిరిపోయింది. చీరకట్టుకొని, మెడలో తాళిబొట్టుతో, చేతిలో తుపాకీ పట్టుకొని చాలా సీరియస్‌గా ఉంది సమంత. దీంతో.. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది.
అయితే.. ఈ సినిమా అనౌన్స్మెంట్ తప్పితే మరో అప్టేట్ బయటికి రాలేదు. షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో సమంతకు మళ్లీ ఏమైంది? హెల్త్ ఇంకా సెట్ అవలేదా? అనే చర్చ మొదలైంది. అంతేకాదు.. మళ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటోందనే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత మయోసైటిస్‌తో సమస్యలు ఎదుర్కొంటింది. అలాగే.. స్కిన్, ఇమ్యూనిటీ పవర్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వాటికి చికిత్స తీసుకుంటోందని టాక్. అందుకే ‘మా ఇంటి బంగారం’ మూవీ షూటింగ్ స్టార్ట్ కాలేదని ప్రచారం జరుగుతోంది. మరి సమంత దీని పై ఏమైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.