Nithya Menon: టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో నిత్యా మీనన్?
మళయాళీ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన నిత్య.. ఇప్పుడు టాలీవుడ్లో యంగ్ హీరో సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో?
Nithya Menon: కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లానాయక్’లో నటించింది ఈ బొద్దుగుమ్మ. అలాగే ధనుష్ నటించిన ‘తిరు’ అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించింది. ప్రస్తుతం తమిళ్లో ఒకటి రెండు సినిమాలు చేస్తోంది. అయితే ఆ మధ్య నిత్య సినిమాల విషయాల కంటే పర్సనల్ లైఫ్ పరంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఆ మధ్య నిత్య పెళ్లి, ఫలానా హీరోతో డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఓ మలయాళ హీరోను పెళ్లి చేసుకోబోతుందని కూడా వినిపించింది. కానీ ఈ మధ్య నిత్య మీనన్ కాస్త సైలెంట్‌గా ఉంది.
తెలుగులో అయితే నిత్యను దాదాపుగా మరిచిపోయినట్టైంది. కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు. అయితే.. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ సినిమాలో నటించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే లయ కూడా కీలకపాత్రలో కనిపించబోతుంది. ఇక ఇప్పుడు నిత్యా మీనన్ గెస్ట్ పాత్రలో కనిపించబోతుందట. గతంలో నితిన్, నిత్య కాంబినేషన్లో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే.. సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో కలిసి నటించనుంది. అయితే.. నిత్య మీనన్ ఎలాంటి రోల్ చేస్తుందనే విషయంలో క్లారిటీ రావాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.