»When Will The Second Trailer From Kalki Be Released
kalki 2898AD: ‘కల్కి’ నుంచి రెండో ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఫైనల్‌గా కల్కి 2898ఏడి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఈ ట్రైలర్ చూస్తే.. హాలీవుడ్ సినిమా చూసినట్టుగా ఉందని అంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే.. కల్కి నుంచి రెండో ట్రైలర్ కూడా రానుందని అంటున్నారు.
When will the second trailer from 'Kalki' be released?
kalki 2898AD: ‘కల్కి 2898 ఏడి’ ట్రైలర్ చూస్తే హాలీవుడ్ సినిమానే తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారా? అనే సందేహాలు రాక మానదు. ఎందుకంటే.. నాగ్ అశ్విన్ కల్కిని అద్భుతంగా చెక్కినట్టుగా ట్రైలర్లో చూపించాడు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో అదిరిపోయింది ట్రైలర్. మూడు నిమిషాల్లోనే తన విజన్ ఎలా ఉంటుందో శాంపిల్‌గా చూపించాడు నాగఅశ్విన్. ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నాగ అశ్విన్ ఊహాలోకం ఊహకందని విధంగా ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ సూపర్ లుక్‌లో కనిపించాడు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ షాకింగ్ గెటప్‌లో కనిపించాడు. అమితాబ్ క్యారెక్టర్ హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇలా ట్రైలర్లో ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ప్రపంచపు మొదటి, చివరి ఊరిగా చెప్పుకునే కాశి నగరంలో జరగబోయే యుద్ధం జూన్ 27 తెరమీద చూడబోతున్నాం.
కానీ ఈ ట్రైలర్‌ను బట్టి కథను ఒక అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అసలు పాయింట్‌ను హైడ్ చేసి ఉంచినట్టుగా తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్‌కు ముందు మరో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు ట్రైలర్స్ కట్ చేసి పెట్టాడట నాగ్ అశ్విన్. అందులో ఒకటి మూడు నిమిషాల ట్రైలర్ కాగా.. మరోటి 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో కట్ చేశాడట. మూడు నిమిషాల ట్రైలర్ వచ్చేసింది కాబట్టి.. నెక్స్ట్ రెండున్నర నిమిషాల ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. సినిమా విడుదలకు వారం ముందు ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కొత్త ట్రైలర్లో ఫస్ట్ ట్రైలర్లో లేని గూస్ బంప్స్ కట్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కథను కూడా కాస్త రివీల్ చేసేలా ఉంటుందని టాక్. మరి సెకండ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.