సామాన్యుడు ఉపశమనం కోసం కోరుకునే వాటిలో మొదటి వరుసలో ఉండేది సినిమా. సినిమా థియేటర్ అంటే చాలామందికి ఒక ఎమోషన్. ఫ్యామిలీ తో సినిమాకి వెళ్లడం అనేది ఈరోజుకి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఈవెంట్.. ఎంతో ప్లాన్ చేసుకుని వెళుతుంటారు…
అలాంటి థియేటర్లకు కష్టకాలం వచ్చింది. సిటీలు, టౌన్స్ లో వున్నా థియేటర్ల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా… పల్లెటూర్లలో ఉన్నవాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్చి లో వచ్చిన టిల్లు స్క్వేర్ తరువాత ఎలెక్షన్ ఫివర్ లో అసలు పెద్ద హీరోల సినిమాలు లేక దాదాపు మూడు నెలలు థియేటర్ల యాజమాన్యాలు, పనిచేసే స్టాఫ్, కార్మికులు అల్లాడిపోయారు..
ఎలెక్షన్ హడావిడి ముగిసాక… జూన్ నెలాఖరులో కల్కి రూపంలో వారికి కొంత ఉపశమనం వచ్చింది. అయితే కల్కి సినిమా ఓవరాల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ. సి,డి సెంటర్స్ లో ఆశించినంత స్థాయిలో రాణించలేదు. సినిమా జోనర్, మేకింగ్ విధానం ఇలా చాలా కారణాల వల్ల.
కల్కి వారం రోజుల తరువాత సి,డి సెంటర్ల కలెక్షన్ అంతంతమాత్రమే.
ఇప్పుడు దాదాపుగా మళ్ళీ సమ్మర్ నాటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగష్టు 15న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ వచ్చే వరుకు చెప్పుకోదగ్గ, మాస్ సెంటర్ల ఆడియన్స్ చూసే సినిమాలు కనిపించట్లేదు. స్టార్ హీరోల సినిమాలు రెగ్యులర్ గా లేకపోవడం కూడా ఈ సంక్షోభానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రతీవారం చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా పవర్ ఖర్చులు, మైంటెనెన్సు ఖర్చులు కూడా రికవర్ అవ్వని కల్లెక్క్షన్స్ నమోదు అవ్వడంతో ఎగ్జిబిటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది