మొన్న జరిగిన ఎన్నికల్లో హ్యాట్ట్రిక్ విక్టరీ సాధించి మంచి ఊపు మీద వున్నా నందమూరి బాలకృష్ణ ప్రజాసేవతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నారు.. ఈ షూటింగ్ కి సంబందించిన ఒక కీలక షెడ్యూల్ రాజస్థాన్ లో జరగబోతుంది.
ఇది చాలా పెద్ద షెడ్యూల్ అని తెలుస్తుంది. దాదాపు 40 రోజులు పాటు బాల కృష్ణ, యూనిట్ సభ్యులు అక్కడే ఉండాలని తెలుస్తుంది. సినిమా లో కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారని టాక్. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుందని, ఆ తరువాత విడుదల తేదీ ప్రకటన ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట.
భారీ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు బాబీ, గత సినిమా వాల్తేరు వీరయ్యతో భారీ సక్సెస్ అందుకున్నాడు. అలాగే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలయ్య, వరుస సూపర్ హిట్స్ తో బాలయ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో, సినీవర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి