»Mahesh Babu Rajamouli Is Planning Heavily How Many Parts
SSMB29: భారీగా ప్లాన్ చేస్తున్న ‘మహేష్ బాబు-రాజమౌళి’.. ఎన్ని పార్ట్స్ అంటే?
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వినిపిస్తునే ఉంది. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాటు.. ఏకంగా మూడు భాగాలు అనే టాక్ వైరల్ అవుతోంది.
'Mahesh Babu-Rajamouli' is planning heavily.. How many parts?
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించకముందే.. ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అవుతోంది. జక్కన్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టార్ క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. మళయాళ యాక్టర్ పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు.. ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ హీరోయిన్గా ఫిక్స్ అయినట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే.. ఈ సినిమాను జక్కన్న ఫ్రాచైంజీగా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. ఇక ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
అంతేకాదు.. మొదటి భాగంలో మహేష్ హీరో కాగా, మిగిలిన భాగాల్లో మరో ఇద్దరు స్టార్స్ నటిస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాజమౌళి ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, రాజమౌళి నుంచి మూడు భాగాలు రావాలంటే పదేళ్లకు తక్కువ సమయం పట్టదు. కాబట్టి.. ఇప్పుడే మహేష్, రాజమౌళి సినిమా ఇన్ని భాగాలు అని తేల్చేయలేం. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఆగష్టు వరకు వెయిట్ చేయాల్సిందే. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా.. ఎస్ఎస్ఎంబీ 29 గ్రాండ్ లాంచింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా.. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందనే టాక్ ఉంది. మరి జక్కన్న ఈ ప్రాజెక్ట్‌ను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.