NZB: ఆర్మూర్ పట్టణంలో శనివారం సీఎం కప్ టార్చ్ ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.