SRD: మునిపల్లి మండలం బొడిశెట్టిపల్లి సర్పంచ్, వార్డు సభ్యులు ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ గులాబీ కండువా కప్పి హరీష్ రావు స్వాగతించారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విఫలమైందని హరీష్ రావు ఈ సందర్భంగా ఆరోపించారు.