VKB: తాండూర్ పట్టణానికి అతి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం రసూల్పూర్ ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చే ఉగాది నాటికి రామపురంగా నామకరణం చేస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో బంగారం వెండి కుప్పలుగా పోసి అమ్మేవారని ప్రాంతానికి రసూల్పురం అని పేరు ఉండేదని, నిజాం పరిపాలన తర్వాత అది రసూల్పూర్గా వ్యవహారంలోకి వచ్చిందని తెలిపారు.