వెస్టిండీస్ టీమ్ తమ సొంత గడ్డపై 25 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ను గెలిచింది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మూడో వన్డే మ్యాచ్లో విండీస్ జట్టు విజయం సాధించి 24 ఏళ్ల తర్వాత రికార్డును నెలకొల్పింది. మూడో వన్డే మ్యాచ్కు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించారు. అయినప్పటికీ వెస్టిండీస్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిలో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో వెస్టిండీస్ జట్టు కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతన్న ఈ మ్యాచ్ సమయంలో వర్షం వల్ల మ్యాచును 40 ఓవర్లకు తగ్గించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ 71 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ 45 పరుగులు చేయగలిగాడు. ఫిలిప్ సాల్ట్ 4, విల్ జాక్స్ 17, జాక్ క్రాలే 0, హ్యారీ బ్యూక్ 1 పరుగు చేయగా జోస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్య చెరో వికెట్ పడగొట్టగా, షెపెర్డ్ 2 వికెట్లు తీశాడు.
ఆ తర్వాత వర్షం కారణంగా వెస్టిండీస్ ఇన్నింగ్స్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారంగా వెస్టిండీస్ టార్గెట్ 188గా నిర్ణయించారు. ఆ టార్గెట్ను విండీస్ జట్టు 31.4 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి సాధించగలిగింది. విండీస్ బ్యాటర్లలో కార్టీ 50, ఆథనాజ్ 45, రొమారియో షెపర్డ్ 41 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు తీశాడు. గుస్ అట్కిన్సన్ 2, రెహాన్ అహ్మద్ 1 వికెట్ తీశాడు.