ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో టెస్టులో విజయం తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Rohith Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనను అందించలేదనే చెప్పుకోవాలి. రోహిత్ మొదటి రెండు గేమ్‌లలో తక్కువ పరుగులు చేయడంతో రోహిత్ శర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత జట్టులో యువబ్యాటర్లు చాలా మంది ఉన్నారు. రోహిత్ శర్మకు వయసు మీద పడుతుంది. అతని స్థానంలో యువకులకు స్థానం కల్పించాలని ట్రోల్స్ చేస్తున్నారు.
అనూహ్యంగా రోహిత్ శర్మ రాజ్‌కోట్, ధర్మశాలలో సెంచరీలు సాధించడం ద్వారా అద్భుతమైన పునరాగమనం చేశాడు. దీంతో ఆయనపై వచ్చిన ట్రోల్స్‌కు బ్రేక్ పడింది. ఐదో టెస్టులో విజయం తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నా ఆటకు తగిన న్యాయం చేయలేని రోజు స్వయంగా రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఓ వైపు క్రికెట్ ఫ్యాన్స్ కూడా భారత జట్టులో యువ ప్లేయర్లతో పాటు రోహిత్, విరాట్ తప్పకుండా ఉండాలని భావిస్తున్నారు. వీరిద్దరు లేని టీ20 జట్టును ఊహించుకోలేమని తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.