»T20 World Cup 2024 Terror Threat Trinidad Pm Icc React
T20 World Cup 2024: ఉగ్రముప్పు.. స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్రముప్పు ఉండే ప్రమాదం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు.
T20 World Cup 2024: Terror threat.. Trinidad PM, ICC react
T20 World Cup 2024: జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్రముప్పు ఉండే ప్రమాదం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నార్త్ పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్‌ల నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు. ఐసీసీ పరిస్థితులను గమనిస్తోంది. ఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపింది. కథనాలు వచ్చిన వెంటనే అధికార యంత్రాంగంతో మాట్లాడమని తెలిపారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ప్రతి ఆటగాడి భద్రతకు భరోసానిచ్చింది.
కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఎలాంటి రిస్క్ అయిన తట్టుకునేలా చర్యలు తీసుకుంటామనే నమ్మకం కలిగించిందని ఐసీసీ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ 21వ శతాబ్దంలో ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం దురదృష్టకరమని ట్రినిడాడ్ పీఎం అన్నారు. విభిన్న మార్గాల్లో ఉగ్రవాదం వ్యాపిస్తోందన్నారు. అతిపెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు దక్కింది. దానిని విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టాం. ఉగ్రమూకలు ఎలాంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం లేదన్నారు. టోర్నీ మ్యాచ్‌లు జరిగే వేదికలు, పర్యటకలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉండేందుకు వీలు కల్పించామని ట్రినిడాడ్ పీఎం తెలిపారు.