Pm Modi: YCP government has plunged the state into debt
Pm Modi: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గోదావరి మాతకు ప్రణామాలు చెబుతూ.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారన్నారు. ఇక్కడి నుంచి ఇప్పుడే కొత్త చరిత్ర లిఖించబోతున్నామని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని దూరం పెడతారు. రాష్ట్రమైన, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఊబిలోకి నెట్టిందన్నారు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందన్నారు.
దేశం అభివృద్ధి చెందుతుంటే రాష్ట్రం కూడా అంతే స్పీడ్తో అభివృద్ధి చెందాలి. కానీ కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు చేస్తామన్నారు. కానీ చేయలేదు ఏపీలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ గద్దె నెక్కిన తర్వాత మద్యం సిండికేట్గా తయారైంది. వైసీపీ పార్టీకి అవినీతి నిర్వహణ తప్ప.. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆ పార్టీ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోందని.. ఆ పార్టీ నేతల డబ్బుును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయని మోదీ అన్నారు.