»Amitabh Bachchan Its A Great War Prepare Yourselves
Amitabh Bachchan: ఇది మహాయుద్ధం.. విజయం ముందు మీరు తలవంచొద్దు!
మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ టీమ్ఇండియాకు ప్రత్యేక సందేశమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Amitabh Bachchan: మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ టీమ్ఇండియాకు ప్రత్యేక సందేశమిచ్చారు. కల్కి 2898 ఏ.డి లోని అశ్వత్థామ అవతారంలో వచ్చి క్రికెటర్లకు సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అశ్వత్థామగా అమితాబ్ క్రికెటర్లలో ప్రేరణ నింపేందుకు ఈ వీడియో రూపొందించారు. వీడియో బ్యాగ్రౌండ్లో కల్కి సినిమా మ్యూజిక్‌తో రూపొందించారు. ఇది మహా యుద్ధం, గొప్ప పోరాటం. విజయం ముందు మీరు తలవంచొద్దు. ధైర్యంగా ఉండండి.
మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి. బలాన్ని చూపండి. ప్రతి తల్లి గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు అని బిగ్‌బీ క్రికెటర్లకు పిలుపునిచ్చారు. ఈ వీడియోలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య తదితర క్రికెటర్లను చూపించారు. అలాగే దేశానికి ప్రపంచకప్ అందించిన మహేంద్రసింగ్ ధోనీ, నాటి సంబరాలను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.