»Bjp List Loksabha Election Rae Bareli Dinesh Pratap Singh And Kaisarganj Karan Bhushan Singh Son Of Brij Bhusan
Brij Bhushan: లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్న బ్రిజ్ భూషణ్ కి బీజేపీ షాక్
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల 17వ జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ స్థానాల అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి.
Brij Bhushan: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల 17వ జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ స్థానాల అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. కైసర్‌గంజ్ స్థానం నుండి బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. రాయ్‌బరేలీ అభ్యర్థి పేరును కూడా పార్టీ వెల్లడించింది. పార్టీ ఇక్కడ దినేష్ ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దించింది.
కరణ్ భూషణ్ సింగ్ ఎవరు?
బిజెపి సిట్టింగ్ ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ టిక్కెట్‌ను రద్దు చేసింది. కైసర్‌గంజ్ స్థానం నుండి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను పోటీకి దింపింది. కరణ్ భూషణ్ సింగ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చిన్న కుమారుడు. కరణ్ భూషణ్ 13 డిసెంబర్ 1990న జన్మించాడు. తనకు ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నారు. అతను డబుల్ ట్రాప్ షూటింగ్లో నేషనల్ ప్లేయర్. కరణ్ భూషణ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం నుండి BBA, LLB డిగ్రీలను పొందారు. ఆస్ట్రేలియా నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లొమా కూడా చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను కోఆపరేటివ్ విలేజ్ డెవలప్మెంట్ బ్యాంక్ (నవాబ్‌గంజ్, గోండా) అధ్యక్షుడు కూడా. ఇది ఆయనకు తొలి ఎన్నిక.
అన్నయ్య బీజేపీ ఎమ్మెల్యే
2024 ఫిబ్రవరిలో భారత రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కరణ్ భూషణ్ అన్నయ్య ప్రతీక్ భూషణ్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే.