మామూలుగా కమర్షియల్ హంగులతో సినిమా తీస్తుంటేనే ఏదొక వివాదం వచ్చి మీద పడుతుంది. అలాంటిది పురాణాలు, మన ఇతిహాసాలు మీద సినిమా అంటే అవి తప్పవు కదా. కల్కి సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తో పాటు సినిమా యూనిట్ ని కూడా వదలకుండా అందరికి లీగల్ నోటీసులు పంపించారు ఒక స్వామీజీ.
ఉత్తర్ ప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి సినిమాపై విమర్శలు చేశారు. తల్లి పాత్ర చేసిన దీపికాకు కృత్రిమ గర్భం ద్వారా కల్కి జన్మించబోతున్నట్టు చూపించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే అని ఆయన అన్నారు. హిందూ గ్రంధాలను ఇష్టానుసారంగా వాడుకుని సినిమాలు తీస్తున్నారు, ఈమధ్య ఇదొక ఫాషన్ అయిపోయిందని స్వామిజి అన్నారు
కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఓవర్సీస్, నార్త్ ఇండియాలో కల్కి ఎక్కువ లాభాలను రాబట్టింది. ఎన్నో ఏళ్ల తరువాత స్టార్ హీరోతో భారీ విజయం నమోదు చేసింది వైజయంతి మూవీస్ సంస్థ