ఏదైనా పండుగ వస్తుందంటే చాలు మన తెలుగు నిర్మాతలు సినిమాలతో రెడీ అవుతుంటారు. ప్రేక్షకులకు కూడా పండుగ రోజు సినిమా చూడటం ఒక అలవాటు. కొన్ని దశాబ్దాల నుంచి ఇది జరుగుతుంది. పండుగలతో పాటు పబ్లిక్ హాలిడేలకు కూడా సినిమాలు ఎక్కువగానే రిలీజ్ చేస్తుంటారు. ఇండిపెండెన్స్ డే, గండి జయంతి లాంటి రోజులకు కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఈ ఏడాది కూడా ఆగష్టు 15న సినిమాల సంఖ్యా కాస్త ఎక్కువగానే ఉంది. తెలుగులో ఇప్పటికే రామ్ – పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్, గీతా ఆర్ట్స్ ‘ఆయ్’, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ’35’ సినిమాలు ఇప్పటికే వస్తున్నాయి ప్రకటించారు. అయితే సడన్ గా క్రేజీ కాంబినేషన్ అయిన రవితేజ- హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ ఆగష్టు 14న రాబోతుందని సమాచారం. 14వ తేదీ బుధవారం అయినప్పటికీ సోలో రిలీజ్ ఉంటుందని, రెండవ రోజు ఎలాగో హాలిడే కాబట్టి సినిమా కి ఎఫెక్ట్ ఉండదని భావిస్తున్నారట. 16వ తేదీ నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది.
ఇదిలా ఉంటే పక్క భాషల నుంచి కూడా కాంపిటీషన్ గట్టిగానే ఉంది. చియాన్ విక్రమ్- పా రంజిత్ ల ‘తంగలన్’, హిందీ నుంచి స్త్రీ2, జాన్ అబ్రహం వేదా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ్, హిందీ సినిమాలు బి,సి సెంటర్స్ లో అంతగా ప్రభావం చూపించకపోయినా సిటీల్లో డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల వేట తప్పేలా లేదు.
మొత్తానికి అన్ని భాషలు కలిపి 6 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. చాలా కాలం తరువాత సినీ అభిమానులకు ఈ ఇండిపెండెన్స్ డే ఒక మూవీ ఫెస్ట్ లా ఉండబోతుంది