T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు ఉగ్రవాద హెచ్చరిక
జూన్‌లో టీ20 ప్రపంచ కప్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్‌కు ఉగ్రదాడులు పొంచి ఉన్నట్లు తాజాగా సపోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
T20 World Cup 2024: ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు అతిథ్యం ఇస్తున్నాయి. ఈ పాటికే వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఇక ఈ ట్రోఫీలో పాల్గోనే దేశాలు తమ జట్లును కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ వార్త క్రికెట్ అభిమానులను కాస్త కలవరపాటుకు గురిచేసింది. టీ20 వరల్డ్ కప్‌కు ఉగ్రవాద హెచ్చరికలు వచ్చాయి. వెస్టీండిస్ బోర్డుకు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన బోర్డు ఈ మేరకు తమ భద్రతను కట్టుదిట్టం చేసింది. అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డ కథనాల ప్రకారం ఐస్లామిక్ స్టేట్ అనుకూల మీడియా నశీర్ పాకిస్థాన్ క్రీడాలు నిర్వహించే ప్రదేశాలపూ దాడులు చేయాలనే ప్రచారాలను ప్రారంభించింది.
అలాగే అప్ఘనిస్థాన్‌కు చెందిన ఐఎస్ తీవ్రవాద సంస్థ వివిధ దేశాల్లోని తమ మద్దతుదారులను సన్నద్దం కావాలని కోరినట్లు తెలుస్తుంది. ఈమేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ స్పందించారు. వెస్టిండీస్ వేదికల వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతీ ఆటకు హాజరయ్యే ప్రేక్షకుల భద్రతే తమకు తొలి ప్రాధాన్యత అని చెప్పారు. అందుకని కట్టుదిట్టమైన భద్రత బలగాలను, వివిధ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జూన్ 1న మొదలై అదే నెల 29 న ముగుస్తుంది.