»Delhi Darbhanga Superfast Express Fire Accident At Etawah Uttar Pradesh
Fire accident: సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..దూకి తప్పించుకున్న ప్రయాణికులు
యూపీలోని ఇటావాలో బుధవారం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రమాదవశాత్త ఒక కోచ్‌లో పెద్ద ఎత్తున మంటలు భారీగా చెలరేగాయి. ఆ క్రమంలో పలువురు ప్రయాణికులు ట్రైన్ నుంచి కిందకు దూకి పారిపోయారు.
న్యూఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న Delhi-Darbhanga సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎస్-1 కోచ్‌లో వెలుగులోకి వచ్చిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే ముందుగానే రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళుతున్నప్పుడు స్లీపర్ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు. ఆ వెంటనే అప్రమత్తమై రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించి రైలును నిలిపివేశారు. అనంతరం స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. మరికొంత మంది రైలు నుంచి మంటలను తప్పించుకునేందుకు కిందకు దూకి పారిపోయారు. ముందుగానే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
नई दिल्ली से दरभंगा जा रही ट्रेन नंबर– 02570 (हमसफर एक्सप्रेस) के कोच S–1 में आग लगी। इटावा में सराय भूपत रेलवे स्टेशन के पास का मामला। सिलेंडर में धमाके से आग लगने की बात सामने आई। रेल यातायात रोका गया। #Etawah#uppic.twitter.com/aCcefz4o1w
మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. అయితే రైలులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్(uttar pradesh)లోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు(fire) చెలరేగినట్లు పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి.