Uttar Pradesh: 121 people died for the dust of Bhole Baba's feet
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో జరిగిన తీవ్ర విషాదం అందరిని బాధపెట్టింది. భోలే బాబా పాదా ధూళి కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటలో మరణించారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం జనం ఒక్కసారిగా వెళ్లారు. ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వాళ్లలో 108 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. చిన్న చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, పాదాల దగ్గర మట్టి సేకరించేందుకు చాలామంది భక్తులు వచ్చారు. ఒక్కసారిగా ఎక్కువ జనం రావడం, ఒకరిపై ఒకరు పడటంతో అక్కడ ఉన్న కొందరు చెప్పారు. భారీ రద్దీ వల్లే ఇలా జరిగిందని పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50,000 చొప్పున పరిహారాన్ని ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.