»Pm Modi Modi Gave A Glass Of Water To An Opposition Mp The Video Is Going Viral
Pm Modi: విపక్ష ఎంపీకి గ్లాసు నీళ్లు ఇచ్చిన మోదీ.. వైరల్ అవుతున్న వీడియో
లోక్‌సభ సమావేశాల్లో ప్రధాని మోదీ విపక్ష ఎంపీకి గ్లాసు నీళ్లు అందించారు. విపక్ష ఎంపీకి మోదీ సెటైరికల్‌గా గ్లాసు నీళ్లు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Pm Modi: Modi gave a glass of water to an opposition MP.. The video is going viral
Pm Modi: ప్రస్తుతం లోక్‌సభ సమావేశాలు మంచి వేడి మీద జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభ సమావేశం మొదట్లోనే అసహనంగా కనిపించారు. దీనికి ముఖ్య కారణం విపక్షాల ప్రసంగాలు. స్పీకర్‌తో సహా అందరినీ ఆశ్చర్యపరిచేలా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ గంట 40 నిమిషాలు ప్రసంగించారు. ఈయన స్పీచ్ కరెక్టు కాదని.. స్పీకర్‌తో సహా అమిత్ షా కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రధాన ముందు ఆందోళనలు చేస్తూ ఉన్న విపక్ష ఎంపీకి గ్లాసు వాటర్ ఇచ్చారు.
Best video of the day!
When PM Modi was speaking, opposition MPs were in well, shouting to disturb him..
తన సిబ్బంది ద్వారా గ్లాస్‌తో వాటర్ తెప్పించి విపక్ష ఎంపీ చేతికి ఇచ్చారు. దీంతో ఆ విపక్ష ఎంపీ షాక్ అయ్యారు. ఆ గ్లాసు నీళ్లు తీసుకోవడానికి విపక్ష ఎంపీ నిరాకరించిన ప్రధాని స్థాయి వ్యక్తి ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. మరి ఆ గ్లాసు నీళ్లు తాగారో లేదో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సభలో మోదీ ఎంపీల అలసటను గుర్తించి తనదైన శైలిలో సెటైరికల్‌గా గ్లాసుతో నీళ్లు తాగించారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజల సమస్యలను సభలో మాట్లాడి అధికార పక్షంతోనే నీళ్లు తాగించామని విపక్ష నేతలు అంటున్నారు.