టాటా మోటార్స్ ఐకానిక్ SUV సియెర్రా రీఎంట్రీ భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. బుకింగ్స్ నిన్న ప్రారంభమవగా.. మొదటిరోజే 70వేలకు పైగా కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకున్నారు. మరో 1.35 లక్షల మంది తమకు నచ్చిన వేరియంట్లను సెలక్ట్ చేసుకున్నారు. ఈ కారు ధర(Ex.Showroom) రూ.11.49 లక్షల నుంచి 21.29 లక్షల వరకు ఉంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఈ కార్లు రోడ్లెక్కనున్నాయి.