గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం 24, 39, 28వ డివిజన్లలో పర్యటించి తాగునీరు, ఆరోగ్య సేవలకు సంబంధించిన కీలక అభివృద్ధి పనుల కోసం స్థల పరిశీలన చేశారు. ప్రజలకు శాశ్వత పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. SP బంగ్లా ఎదురుగా కొత్త ELSR ట్యాంక్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.