NLR: ముత్తుకూరు మండలం ఈపూరులోని విరుపాక్షేశ్వర స్వామి దేవస్థానం వంశపారపర్యం ధర్మకర్తగా కొనసాగుతున్న దువ్వూరు విశ్వమోహన్ రెడ్డిని తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దేవస్థానం భూముల విషయంలో జరిగిన అవకతవకల కారణంగా సస్పెండ్ చేస్తూ దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.