ప్రకాశం: కనిగిరి మండలం గురవాజీపేట గ్రామంలో గురువారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. ఈ మేరకు స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనశాల భావన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా అవార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు.