మంచి మూవీకి ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని మరోసారి రుజువైందని మౌళి ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్లో అన్నారు. ఈ మూవీ ఇంత విజయం సాధిస్తుందని అనుకోలేదని, 2 వారాలే థియేటర్లలో ఉంటుందనుకున్నామని చెప్పారు. కానీ తొలిరోజే తమ బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయన్నారు. మూవీకి సపోర్ట్ చేసిన బండ్ల గణేష్, రవితేజ, నాని అందరికీ థ్యాంక్స్.. ఈ వారమంతా గాల్లో తేలుతూనే ఉన్నానని అన్నారు.