NLR: శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి కృపతో ఆంధ్రప్రదేశ్ రాష్టం పరిశ్రమలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు. గురువారం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వైభవంగా నిర్వహిస్తున్న పోలేరమ్మ జాతరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.