అనుమతి లేకుండా ఐశ్వర్యరాయ్ ఫొటోలు వాడొద్దని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుతున్నారని ఆమె కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆమె పేరు, ఫొటోలు ఉన్న URLలను 72 గంటల్లోగా తొలగించాలని గూగుల్‌ను ఆదేశించింది. ఆ URLలను 7రోజుల్లో బ్లాక్ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు సూచించింది. ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని చెప్పింది.