ప్రకాశం: మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి హుండీ ఆదాయం రూ.12.45 లక్షలు వచ్చిందని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆలయంలో 4 నెలల 16 రోజులకు గానూ హుండీ కానుకలు లెక్కించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పర్యవేక్షకులు సీహెచ్ వేణుగోపాల్‌రావు, రాజ్యలక్ష్మి సేవా సంఘం భక్త మహిళా సమాజం, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.