HYD: ఓల్డ్ సిటీ యాకత్ పురాలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలో ఐదేళ్ల బాలిక పడిన ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. హైడ్రా నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలో పాప పడిపోయిందని, హైడ్రా సిబ్బంది సిల్ట్ కోసం డ్రైనేజీ మూత తీసి పెట్టడంతో ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.