ప్రకాశం: ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పి సీఈవో చిరంజీవి బుధవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జడ్పీ ఛైర్పర్సన్ వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.