MBNR: మాజీ మంత్రి మాజీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మరెడ్డి ప్రభుత్వ పోకడలను తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. వలసల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు నేడు హరితవనంగా మారిందని, BRS ప్రభుత్వం 18 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందించిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం జిల్లాకు సాగు నీరు అందించే ప్రాజెక్టులు కట్టడంలో విఫలం అయిందన్నారు.