VSP: విశాఖలోని జీవీఎంసీ 87వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, ఇటీవల గాజువాక నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన తైనాల విజయ్ కుమార్ను గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గాజువాకలో అన్ని వార్డులను పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని తైనాల విజయ్ కుమార్ తెలిపారు.