ఆసియా కప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఓటమిపై కోచ్ రాజ్‌పుత్ స్పందించాడు. భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని ఆయన ప్రశంసించాడు. యూఏఈ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్లాస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. ఇది వారికి ఒక కొత్త అనుభవమని పేర్కొన్నాడు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపాడు.