ఆస్ట్రేలియా-A జట్టు, భారత్-A జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. భారత్ పర్యటనలో భాగంగా మొదటి టెస్టు సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు, రెండో టెస్టు సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు లక్నో వేదికగా జరుగుతాయి. అలాగే, 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఈనెల 30న, రెండో వన్డే అక్టోబర్ 3న, మూడో వన్డే అక్టోబర్ 5న జరుగుతాయి. ఈ టోర్నీ కోసం భారత-A టెస్టు జట్టును ఇప్పటికే ప్రకటించారు.