VZM: సంతకవిటి మండలం సిరిపురంలో రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు గురువారం అధిక సంఖ్యలో చేరుకున్నారు. 220 యూరియా బస్తాలు రావడంతో రైతులు తోపులాడుకున్నారు. 1500 మంది వరకు రైతులు వరి సాగు చేస్తున్నారని, ఇప్పటికీ 862 బస్తాలు పంపిణీ చేశామని సచివాలయ వీఏఏ కిల్లి త్రివేణి తెలిపారు. మరో 440 బస్తాలు అవసరమని వెల్లడించారు.