ADB: లక్ష్యంతో చదువుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జూర్ సూచించారు. గురువారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేప్పుడు ఒక లక్ష్యంతో చేరాలని , గమ్యం లేని ప్రయాణం, లక్ష్యం లేని చదువు వ్యర్థం అని ఆయన అన్నారు.