»Lok Sabha The Second List Of Bjp Lok Sabha Candidates Will Be Released Today
Lok Sabha: నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..?
లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది.
Lok Sabha: లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. ఇప్పుడు కమలం పార్టీ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. సెకెండ్ లిస్ట్‌ను ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈరోజు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం లభించగా 28 మంది మహిళలకు చోటు దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలకు బీజేపీ అవకాశం కల్పించింది. 57 మంది ఓబీసీలకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. తొలి జాబితాలో యువతకు 47 స్ధానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్ధానాలను కేటాయించారు. కీలక యూపీ నుంచి 51 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి బరిలో నిలిచే 5గురి పేర్లను తొలి జాబితాలో వెల్లడించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులకు తొలి జాబితాలో చోటు దక్కింది.