»Brs Bsp Alliance Koneru Konappa To Leave The Party
Koneru Konappa: బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు.. పార్టీ వీడనున్న కోనేరు కోనప్ప
తెలంగాణ రాజకీయాల్లో మరో పొత్తు పుట్టుకొచ్చింది. అనుహ్యంగా బీఆర్ఎస్, బీఎస్పీ రెండు పార్టీల అలెన్స్ అధికార పార్టీ గుండెల్లో వణుకు పుట్టించాయి. ఈ పొత్తుతో సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారట.
BRS BSP alliance.. Koneru Konappa to leave the party
Koneru Konappa: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తు పుట్టుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్(BRS) పార్టీతో బీఎస్పీ(BSP) పార్టీ పొత్తు కుదుర్చుకుంది. మరి కొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీకి మొగ్గుచూపుతున్నారు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీతో పొత్తు బీఆర్ఎస్ మరో నేతను కోల్పోవడానికి కారణం అయిందని తెలుస్తుంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం.
బీఎస్పీ పార్టీతో అలెన్స్ను వ్యతిరేకిస్తున్న కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసీ ఈ నెల 12, లేదా 15న కాంగ్రెస్‌లోకి చేరనున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. వీరిద్దరు కాకుండా అక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వై హరీష్ బాబు గెలిచాడు. ఈ పోత్తు వలన పార్లమెంట్ ఎన్నికలకు ఆయనతో కలిసి నడవాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించుకోవడంపై కోనేరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉందని, పొత్తువిషయమై తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని కోనప్ప ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు అందుకే కార్యకర్తలతో నిన్న రహస్యంగా సమావేశమయ్యారు. త్వరలోనే హస్తం గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.