»Hand Transplantation Doctors Who Operated On Both Hands Of The Painter
Hand Transplantation: పెయింటర్‌కు రెండు చేతుల్ని సర్జరీ చేసిన వైద్యులు
ల్లీ డాక్టర్లు ఓ అరుదైన సర్జరీ చేసి అద్భుతం సృష్టించారు. రైలు ప్రమాదంలో ఓ పెయింటర్ తన రెండు చేతులను కోల్పోయాడు. అయితే ఢిల్లీ డాక్టర్లు ఆ పెయింటర్‌కి చేతులు అమర్చి అద్భుతం సృష్టించారు.
Hand Transplantation: ఢిల్లీ డాక్టర్లు ఓ అరుదైన సర్జరీ చేసి అద్భుతం సృష్టించారు. రైలు ప్రమాదంలో ఓ పెయింటర్ తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో పెయిటింగ్ మళ్లీ వేయలేకపోయాడు. అయితే ఢిల్లీ డాక్టర్లు ఆ పెయింటర్‌కి చేతులు అమర్చి అద్భుతం సృష్టించారు. సౌత్ ఢిల్లీ స్కూల్లో పనిచేస్తున్న మీనా మెహతాకి ఇటీవల బ్రెయిన్ డెడ్ అయ్యింది. తన మరణం తర్వాత ఆ అవయవాలను దానం చేసింది.
కిడ్నీ, లివర్, కార్నియాలను మరో ముగ్గురికి దానం చేశారు. ఆమె చేతులను ఢిల్లీ పెయింటర్‌కు ఫిక్స్ చేశారు. 45 ఏళ్ల ఆ పెయింటర్‌కి 2020లో రైలు ప్రమాదంలో చేతులు కోల్పోయాడు. ఢిల్లీ డాక్టర్లు అతనికి రెండు చేతులు అమర్చి కొత్త చరిత్రను సృష్టించారు. ఈ సర్జరీ గంగారామ్ ఆసుపత్రి డాక్టర్లు చేశారు. సుమారు 12 గంటల పాటు ఈ సర్జరీ చేసి సక్సెస్ సాధించారు. అతనిని ఆసుపత్రి నుంచి రేపు డిస్చార్జ్ చేయనున్నారు.