»Hindustan Aeronautical Limited Bangalore Prime Minister Modi Took A Ride In The Tejas Fighter Jet
PM Modi: ‘తేజస్’ ఓ అద్భుతం
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్నుప్రధాని మోడీ సందర్శించారు. స్వదేశి టెక్నాలజీతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో విహరించారు. మన దేశం ఎందులో తక్కువ కాదని గర్వంగా చెప్పగలనని తెలిపారు.
Hindustan Aeronautical Limited, Bangalore. Prime Minister Modi took a ride in the Tejas fighter jet
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కర్ణాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL)ను శనివారం సందర్శించారు. స్వదేశి టెక్నాలజీతో తయారు చేసిన తేజస్(Tejas) అనే తేలికపాటి యుద్ధవిమానంలో విహరించారు. పర్యటించిన ఫోటోలు ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. తేజస్(Tejas) ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశానాని, ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. స్వదేశి టెక్నాలజీతో తేజస్ తయారు చేయడం సంతోషంగా ఉందని, మన దేశ సామర్థ్యం ఏంటో ఇప్పుడు ప్రపంచం చూస్తోందని, ఈ విషయంలో ఆయనకెంతో గౌరవంగా ఉందని వెల్లడించారు. మన దేశంలో ఎంతో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఉన్నారని, వారి కృషి, అంకిత భావంతో తేజస్ అవిష్కరణ సాధ్యం అయిందని సంతోషం వ్యక్తం చేశారు. భారత వాయుసేన, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌కు అభినందనలు తెలిపారు.
భారత నేవి, ఎయిర్‌ఫోర్స్ ఉపయోగిస్తున్న తేజస్ ట్విన్ సీటర్‌లో మోడీ విహరించారు. తేజస్‌ను తొలుత వాయుసేన కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించింది. తరువాత గ్రౌండ్ మారిటైమ్ ఆపరేషన్స్ కోసం నావెల్ వెరియంట్‌ను కూడా పరీక్షిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. జనరల్ ఎలక్ట్రిక్‌కు చెందిన ఎఫ్414 ఇంజన్లను హెచ్ఏఎల్తో కలిసి భారత్‌లో తయారు చేస్తారు. ఈ ఇంజన్లను తేజస్ మార్క్ 2 కు అమరుస్తారు.