Rajasthan Assembly: రాజస్థాన్ అసెంబ్లీకి (Rajasthan Assembly) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు ఓకే విడత పోలింగ్ జరుగుతుంది. కరణ్ పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. 1863 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిల్చొన్న వారికి అవకాశం ఇస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 51,507 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. 26,393 పోలింగ్ బూత్‌లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్ పుర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ టాంక్ నుంచి, మాజీ సీఎం వసుంధర రాజే ఝల్రాపటన్ నుంచి, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ తారా నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉండటంతో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. మిగతా 4 రాష్ట్రాల్లో ఓకే విడత పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 3వ తేదీన అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.