»Obstacles Removed For Rythubandhu Sensational Announcement Of Election Commission
Rythu Bandhu: రైతుబంధుకు తొలగిన అడ్డంకులు..ఎన్నికల సంఘం సంచలన ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అభ్యర్థన మేరకు నవంబర్ 28వ తేదిలోపు రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజులు కూడా లేదు. అయితే ఈ సమయంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కౌంటింగ్ ముగిసే వరకూ ఎలాంటి పథకాలను అమలు చేయకూడదు. అందులో భాగంగానే ముందుగా రైతుబంధును నిలిపివేసింది. తాజాగా రైతుబంధు పంపిణీకి అనుమతులు ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విజ్ణప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో సుమారు 7 వేల కోట్ల రూపాయల నిధులను దశల వారీగా రైతుబంధులో వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదిన నిర్వహించనున్నారు. ఇకపోతే ఎన్నికల ప్రచారానికి 28వ తేది వరకూ టైం ఉంది. అయితే దీనికి ముందే రైతుబంధు పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.