KTR: మెట్రో రైల్లో కేటీఆర్..స్టూడెంట్స్తో సెల్ఫీలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నేడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే శుభవార్తలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
తెలంగాణ ((Telangana) ఎన్నికల ప్రచారం (Elections Campaign) జోరందుకుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సభ్యులంతా తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే మంత్రి కేటీఆర్ (Minister KTR) వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన నేడు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail)లో ప్రయాణించారు. మైండ్ స్పేష్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకూ ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఆయన ముచ్చటించారు.
మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న (Metro Passengers) కేటీఆర్ (KTR)తో మాట్లాడేందుకు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. చదువులు, ఉద్యోగాల గురించి విద్యార్థులతో మాట్లాడిన కేటీఆర్..వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి స్టేషన్లోనూ మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులతో కేటీఆర్ ముచ్చటించడం విశేషం. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి, కోచింగ్ తీసుకునేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదిరిపోయే శుభవార్తలను బీఆర్ఎస్ చెప్పేందుకు సిద్ధంగా ఉందని, నిరుద్యోగులకు పండగలాంటి వార్త చెప్పనుందని కేటీఆర్ తెలిపారు. అందరూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి ఓటేసి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నారు.