»Hyderabad Metro Rail Services To Be Extended Lb Nagar To Hayathnagar
hyderabad metro : ఎల్బీనగర్, హయత్‌నగర్ మెట్రోకు లైన్ క్లియర్
హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. తాజాగా ఎల్బీ నగర్, హయత్ నగర్ మధ్య మెట్రో లైనుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
LB Nagar To Hayathnagar Metro Train : హైదరాబాద్ శివార్లలో ఉన్న నగర ప్రజలకు శుభవార్త. అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎల్బీనగర్ – హయత్ నగర్ల(LB NAGAR TO HAYATHNAGAR) మధ్య మెట్రో లైనుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫైనల్ మ్యాప్ రెడీ అయ్యింది. ఈ రెండు ప్రాంతాల మధ్య మొత్తం ఏడు కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరంలో మొత్తం ఆరు మెట్రో స్టేషన్లు రానున్నాయి.
ఏడు కిలో మీటర్లలో ఆరు మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రావడంతో చింతల్‌కుంట, వనస్థలిపురం, భాగ్యలత కాలనీ, హయత్ నగర్ల దగ్గరలో ఉండే ప్రజలకు మరింత వెసులుబాటు కలుగనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లోని ప్రజలు మెట్రో ఎక్కాలంటే ఎల్బీ నగర్ రావాల్సి వచ్చేంది. అక్కడి వరకు ఆటోల్లో, బస్సల్లో, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారు. అక్కడ మెట్రో ఎక్కి ఐటీ కారిడార్‌ల్లో ఉద్యోగాలకు వెళుతుండేవారు. ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండేది.
తాజాగా ఈ ఎల్బీనగర్, హయత్ నగర్ రూట్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేషన్లు ఎక్కడ రావాలన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది జాతీయ రహదారి కావడంతో మెట్రో స్టేషన్ల(METRO STATIONS) నిర్మాణం కోసం స్థలం కేటాయింపులు చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణాలూ జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా మెట్రో స్టేషన్లను నిర్మించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపు ఉన్న వారైనా సులువుగా మెట్రో స్టేషన్లకు చేరుకునే విధంగా ఉండాలని అధికారులు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ ఇచ్చేందుకు మెట్రో అధికారులు, జాతీయ రహదారుల సంస్థతో కలిసి వర్కవుట్ చేస్తున్నారు. ఓ ఫైనల్ మ్యాప్‌ని సైతం రెడీ చేశారు. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే తప్ప స్టేషన్లు ఎక్కడెక్కడ వస్తాయన్న విషయంలో స్పష్టత రాదు.