YouTuber Journey In Metro Without Ticket, Netizens Fire
YouTuber Journey In Metro: టికెట్ లేకుండా జర్నీ చేయడం నేరం.. అదీ బస్సు, ట్రైన్.. ఫ్లైట్ చివరికీ మెట్రో అయినా కంపల్సరీగా తీసుకోవాలి. కానీ కొందరు తమ వీడియోల కోసం.. వ్యూస్ కోసం టికెట్ తీసుకోకుండా జర్నీ చేస్తుంటారు. అంతేకాదు ఆ వీడియో మొత్తం తీసి.. యూట్యూబ్‌లో పెడుతుంటారు. అలా యూట్యూబర్ ఫిడియాస్ పనాయోటౌ చేశారు. వీడియో షేర్ చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
టికెట్ లేకుండా ఇండియా మెట్రోలో ఎలా ప్రయాణించాలంటే అని ఓ వీడియో పోస్ట్ చేశాడు. బెంగళూరు మెట్రోలో ఉన్నానని.. టికెట్ లేకుండా ట్రావెల్ చేసిన వీడియోను షేర్ చేశాడు. మెట్రో స్టేషన్లో ఉన్న ప్యాసెంజర్స్‌ను కూడా ఛాలెంజ్ చేశాడు. ఎంట్రీ పాయింట్ వద్ద సెక్యూరిటీ గార్డులెవరు లేని సమయం చూసి స్టేషన్లోకి వచ్చాడు. అలాగే తిరిగి వచ్చి వీడియోలో పంచుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అలాగే యూజర్లు కూడా తెగ తిట్టిపోస్తున్నారు.
మిమ్మల్ని వ్యక్తిగా కాకుండా.. కంటెంట్ క్రియేటర్‌గా ఇష్టపడుతున్న.. కానీ మీరు చేసిన విధానం తప్పు, కంటెంట్ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ఒకరు రాశారు. ఇలాంటి ఇన్ ప్లూయెన్సర్లను ప్రోత్సహించకూడదని మరొకరు కామెంట్ చేశారు. నిబంధనలను పాటించే వరకు తిరిగి భారత దేశం రావొద్దు అని మరొకరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరు తమ ఆగ్రహాన్ని కామెంట్ రూపంలో రాశారు. అవును.. భారత్ వచ్చి, ఏదైనా హిస్టరికల్ ప్లేస్, లేదంటే ఇతర అడ్వెంచర్స్ గురించి వీడియోలు చేయాలి.. కానీ మెట్రోలో టికెట్ లేకుండా ట్రావెల్ చేశానని చెప్పి.. నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు.