రేపు 9 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైళ్లు 11 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను కలపనున్నాయని, అధునాతన భద్రతతో వేగవంతమైన ప్రయాణాన్ని ఇవి అందించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
How Much Fare Of Kacheguda To Yesvantpur And Vijayawada To Chennai
దేశంలోని 11 రాష్ట్రాల్లో 9 కొత్త వందే భారత్ రైళ్ల (Vande Bharath Trains)ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ (Pm Modi) ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఈ 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ వెల్లడించింది.
ఈ 9 వందే భారత్ రైళ్లు (Vande Bharath Trains)… ఉదయపూర్ – జైపూర్, తిరునెల్వేలి-మధురై-చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా), పాట్నా – హౌరా, కాసరగాడ్ – తిరువనంతపురం, రూర్కెలా – భువనేశ్వర్ – పూరి, రాంచీ – హౌరా, జామ్నగర్-అహ్మదాబాద్ మధ్య నడవనున్నట్లు రైల్వే శాఖ (Railways) ప్రకటించింది.
వందేభారత్ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం చాలా వరకూ తగ్గనుంది. ఈ 9 రైళ్లూ కూడా 11 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను (Temples), పర్యాటక ప్రాంతాలను కలపనున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల మధ్య ఉండే ప్రయాణ సమయం మూడు, నాలుగుగంటల వరకూ తగ్గుతుంది. వందే భారత్ రైళ్లలో వేగవంతమైన ప్రయాణాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. సమయం చాలా వరకూ ఆదా అవుతుండటంతో దేశంలో మరికొన్ని వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
ఈ కొత్త వందే భారత్ రైళ్లు (Vande Bharath Trains ) కవాచ్ టెక్నాలజీతో నడవనున్నాయి. ఇందులో అధునాతన భద్రత ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచ స్థాయి సౌకర్యాలు కూడా ఈ కొత్త వందే భారత్ రైళ్లలో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను ఈ రైళ్ల ద్వారా సులభంగా దర్శించుకోవచ్చని రైల్వే తెలిపింది.