తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. అవయవదానంలో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అవయవదానం వందలాది మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు. అవయవదానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
2022 సంవత్సరానికి దేశంలో అత్యధిక అవయవ దానాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల నివేదికలు ఆ వివరాలను వెల్లడించాయి. ఆ నివేదిక ప్రకారంగా తెలంగాణలో గతేడాది 194 అవయవ దానాలు జరగ్గా ఆ తర్వాత 154 అవయవదానాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.