»Baby Elephant Gets Z Category Security As Family Naps In Tamilnadu
Baby elephant : ఏనుగు పిల్లకు జడ్ క్యాటగిరీ భద్రత.. వీడియో వైరల్
పెద్ద ఏనుగులన్నీ కునుకుతీస్తున్న సమయంలో గున్న ఏనుగును రక్షించుకునేందుకు అవి దాని చుట్టూ గుండ్రంగా పడుకుని కునుకు వేశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్గా మారింది.
Baby elephant gets Z-category security : పిల్లలను రక్షించుకోవడం తల్లిదండ్రుల ప్రధమ బాధ్యతగా ఫీలవుతారు. మనుషులైనా, జంతువులైనా ఆ ప్రేమ అలాగే ఉంటుందని తెలియచేసే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఏనుగుల(elephants) గుంపులోని ఓ పిల్ల ఏనుగును రక్షించుకోవడానికి అవి దాని చుట్టూ రక్షణ వలయంలా ఏర్పాటై కునుకేశాయి. ఇది డ్రోన్ కెమేరా కంట పడటంతో వైరల్గా మారింది.
ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏనుగులన్నీ గున్న ఏనుగుకు ఎలా జడ్ క్యాటగిరీ రక్షణను(Z-category security) కలిగించాయో చూడండి అంటూ ఆ వీడియోని షేర్ చేశారు. తమిళనాడులోని(Tamilnadu) అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారస్ట్లో ఓ దగ్గర ఇలా ఏనుగుల కుటుంబం హాయిగా కునుకుతీస్తూ కనిపించింది అంటూ ఆ వివరాలను ఆమె పంచుకున్నారు.
చుట్టూ నాలుగు పెద్ద ఏనుగులు పడుకుని ఉండగా వాటన్నింటి మధ్యలో ఓ చిన్న గున్న ఏనుగు పిల్ల(Baby elephant) హాయిగా కునుకేస్తూ చూడ్డానికి ముచ్చటగా అనిపించింది ఆ వీడియో. మరింకెందుకు ఆలస్యం ఇక్కడున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
A beautiful elephant family sleeps blissfully somwhere in deep jungles of the Anamalai Tiger Reserve in Tamil Nadu. Observe how the baby elephant is given Z class security by the family. Also how the young elephant is checking the presence of other family members for reassurance.… pic.twitter.com/sVsc8k5I3r